మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని గత కొన్ని రోజులుగా హడావుడి జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలపై స్పష్టమైన ప్రకటన రావడం లేదు. సింగరేణిలో ఉన్న యూనియన్లు మాత్రం ఎన్నికల జరపాలని భీష్మించి కూర్చున్నప్పటికీ ఏదో ఒక ఆటంకం ఏర్పడి లైన్ క్లియర్ కావడం లేదు. ఇదిలా ఉండగా బుధవారం హైదరాబాదులోని యాజమాన్యం యూనియన్ల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడితే సారి లేకుంటే వాయిదా పడే అవకాశం ఉంటుందని కొందరు కార్మిక నేతలు పేర్కొనడం జరిగింది.