అధైర్య పడకండి అండగా ఉంటా
రేగా సుదక్క పరామర్శ
రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని కూనవరం గ్రామపంచాయతీకి చెందిన తుర్రం రాజకుమారి అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకొని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి సుధారాణి రాజకుమారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని,రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన మన తెలంగాణ రిపోర్టర్ నాగేళ్ళ సత్యనారాయణ తల్లి పద్మ అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని రేగా సుధారాణి వారి నివాసానికి వెళ్లి పద్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో రేగా కాంతరావు ప్రభుత్వ పిఏ అట్టం లక్ష్మణ్ రావు,కూనవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏనిక ప్రసాద్,పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ గులాబీ సైన్యం కోఆర్డినేటర్ బుద్ధ రాజు నవీన్ బాబు,సీసీ రేగా రవి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు యువజన నాయకులు,రాజు,సోషల్ మీడియా సభ్యులు గుంటక ప్రవీణ్,డేగల సంపత్ తదితరులు పాల్గొన్నారు.