మన్యం న్యూస్ బూర్గంపహడ్:-బూర్గంపహడ్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం కి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన స్థానిక సర్పంచ్ సిరిపురం స్వప్న,బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రసిడెంట్ గొనెల నాని,ఏఎస్ఐ సత్యనారాయణ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కమిటీ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంనీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గంగరాజు యాదవ్,దుద్దుకురు రమేష్,సాధనాల నాగేశ్వరావు పలువరు గ్రామ పెద్దలు,కమిటీ సభ్యులు,భక్త జనం పాల్గొన్నారు.