UPDATES  

 గుర్తింపుసంఘం ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికులకు ఓటుహక్కు కల్పించాలి

గుర్తింపుసంఘం ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికులకు ఓటుహక్కు కల్పించాలి
రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ షావలి

మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్-ఇఫ్టు రాష్ట్రకమిటీ పిలుపులో భాగంగా మంగళవారం 24 సివిక్, సివిల్, ఏరియా స్టోర్ మస్టర్ అడ్డాలవద్ద జీతాలు పెంచాలని, జాతీయ పండుగ సెలవులకు మస్టర్ కల్పించాలని, సింగరేణి సంస్థ లాభాలకు కారకులైన కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలని రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ షావలి అన్నారు. ఈ మేరకు సివిల్ సీనియర్ సూపర్వైజర్ సుధీర్, నాగేశ్వరరావులకు కార్మికుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యాకుబ్ షావలి మాట్లాడుతూ.. ఇంకెంతకాలం సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులను దోపిడి చేస్తారని సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన కోల్ ఇండియాలో ఒప్పందం జరిగినా కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించటం లేదన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు ఓటుహక్కు లేకపోవడం వలన ఈ కార్మికుల బాధలు ఎవరికి పట్టడం లేదన్నారు. అదే గుర్తింపు ఎన్నికల్లో ఓటుహక్కు కల్పిస్తే ప్రభుత్వంగానీ లేదా సంఘాలు గాని పోటీపడి ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోట్లాడేవారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సింగరేణిలో కార్మికచట్టాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !