మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్రశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర్య ఉద్యమయోధురాలు చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పోలారపు పద్మ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని, వారు హైదరాబాద్ రాజ్యంలో నిజాం, పటేల్ల నిరంకుశ ఆధిపత్యాన్ని ఎదిరించి తన అస్తిత్వాన్ని, తెలంగాణ గొంతుకను వినిపించిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు శేఖర్, వైస్ ప్రిన్సిపల్ బిందుశ్రీ , ఐక్యూయేసి కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు, చెంచురత్నయ్య, డాక్టర్ సిహెచ్ రమేష్, ఇంద్రాణి, సరిత, సురేందర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.