మన్యం న్యూస్, దమ్మ పేట, సెప్టెంబర్, 26: దమ్మపేట మండల కేంద్రంలో మంగళవారం అంగన్వాడీ టీచర్లు కార్గో వాహనాన్ని అడ్డుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టిక ఆహారం సరఫరా చేసే కార్గో వాహనానికి అడ్డుగా కూర్చొని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని గత 15రోజులుగా అంగన్వాడీ టీచర్స్ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.