మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 26: అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కన్వీనర్ మొటూరి మోహన్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును తన ఛాంబర్లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుషగుచ్ఛాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అశ్వారావుపేట నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, అశ్వారావుపేట నియోజవర్గంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి అధిక నిధులు మంజూరు చేస్తున్నారని గుర్తు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గెలుపు తథ్యమని, రానున్న ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలని మెచ్చా నాగేశ్వరావు గెలుపుకు యువత నడుం బిగించాలని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని మంత్రి కేటీఆర్ సూచించినట్లు ఆయన తెలిపారు.