విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఇల్లందు మరింతగా అభివృద్ధి చెందాలి ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మన్యంన్యూస్,ఇల్లందు:మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డులో స్థానిక కౌన్సిలర్ సిలివేరి అనిత సత్యనారాయణల ఆధ్వర్యంలో మంగళవారం మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వామివారి ప్రత్యేకపూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లందు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఆ విగ్నేశ్వరుడి ఆశీస్సులతో మరింతగా అభివృద్ధి చెందాలని, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాషా, పార్టీ పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, సుధీర్ తోత్ల, కౌన్సిలర్లు కొక్కు నాగేశ్వరావు, లలితశారద, సామల మాధవిరవితేజ, జేకే శ్రీనివాస్, సిలివేరి అనిత, కడకంచి పద్మ, సంద బిందుప్రవీణ్, చీమల సుజాత, రజిత, పాబోలు స్వాతికిరణ్, కొండపల్లి సరిత, తార, నాయకులు సిలివేరి సత్యనారాయణ, పార్టీ ఎస్సీసెల్ ఇంచార్జ్ మేకల శ్యామ్, మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు రబ్బు, ఆదూరి రవి, మహిళా నాయకురాలు నెమలి ధనలక్ష్మి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.