మన్యం న్యూస్ కరకగూడెం: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా శుభ్రంగా ఉండాలని ప్రాథమిక వైద్యశాల అధికారి డాక్టర్ దుర్గా నరేష్ అన్నారు మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో మంగళవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని 52 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగిందని అన్నారు. గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బందితోపాటు వైద్యాధికారి సిబ్బంది సందర్శన చేస్తూ లార్వా ఉన్న ప్రాంతాలను తొలగించడం జరిగింది అన్నారు. వర్షాల వలన సీజనల్ వ్యాధులైన డెంగు మలేరియా టైఫాయిడ్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు శుభ్రతతో పాటు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూపించారు. దోమలు కుట్టకుండా రక్షణ కోసం విధిగా దోమతెరలు వాడాలని సూచించారు. శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇర్ప. విజయ్ కుమార్, ఏఎన్ఎం.తాటి.సుజాత అసిస్టెంట్ నరసింహారావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.