రేగా సుధారాణి విస్తృత పర్యటన
విజయ విఘ్నేశ్వర స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న రేగా సుధారాణి
రేగా విష్ణు ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతకు వాలీబాల్ కిట్ల పంపిణీ
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల పరిధి లోని పీవీ కాలనీ నందు గల,శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతరావు సతీమణి రేగా సుధారాణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సుందరయ్య నగర్ లోని విజయ విఘ్నేశ్వర స్వామి వారి అన్నదాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రేగా కాంతరావు సతీమణి రేగా సుధారాణి పాల్గొన్నారు. కొండాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి వారి అన్నదాన కార్యక్రమంలో రేగా సుధారాణి పాల్గొన్నారు.అనంతరం మండల పరిధి లోని రామానుజావరం గ్రామ పంచాయతీ,కొత్త మల్లెపల్లి గ్రామంలోని యువకులకు రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో యువకులకు వాలీబాల్ కిట్ ను రేగా సుధారాణి అందజేశారు.ఈ కార్యక్రమంలో విప్ రేగా పీఏ అట్టం లక్ష్మణ్ రావు,సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి సీతారాములు,నియోజకవర్గ కోఆర్డినేటర్ నవీన్ బాబు, నియోజక వర్గ యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ రవి ప్రసాద్,మణుగూరు టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం సృజన్,యువజన నాయకులు, జక్కం రంజిత్,బోయిళ్ళ రాజు, మామిడిపల్లి ప్రసాద్, పారిజాతం సూర్యం,మహిళ నాయకురాలు తాళ్ళపల్లి రజిత, మహిళ కార్యకర్తలు, గణేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.