మన్యం న్యూస్, కరకగూడెం: రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మూడవసారి బీ. ఆర్.ఎస్ పార్టీ ని గెలిపిస్తాయని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు. ఆయన మంగళవారం మండల పరిధిలోని ఉమ్మడి సమత్ మోతే గ్రామ పంచాయతీలోని 26,27,28 ఎన్నికల బూతులకు ప్రతి 100 ఓట్లకు గాను బీఆర్ఎస్ పార్టీ ఒక ఇన్చార్జిని నియమించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నిట్టా. ఏడుకొండలు, సమత్ మోతే సర్పంచ్ ఇర్ప. విజయ్ కుమార్,బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మల్కం.వెంకటేశ్వర్లు,నిట్టా.ప్రభాకర్, సుతారి.నాగేశ్వరరావు, తాటి.క్రిష్ణ,గుడ్ల.రంజీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.