మన్యం న్యూస్,అశ్వాపురం:అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీ పరిధిలో గణనాధుని ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అన్ని దానాలలోకెళ్ల అన్నదానం మహాదానమని మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఫ్రెండ్స్ యూత్ రామాలయం సెంటర్లో గణేష్ మండపం వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడి గణనాథుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతోపాటు సేవా దృక్పథం అలవడుతుందని గ్రామాలలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ లోక క్షేమం కోసం పూజలు, అన్నదానాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.Τ