మన్యం న్యూస్,అశ్వారావుపేట( దమ్మపేట), సెప్టెంబర్, 26: దమ్మపేట మండలం గిరిజన గ్రామాలైన గొర్రెగుట్ట, లింగాలపల్లి గ్రామాల్లో ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మహాగణపతి పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ పాల్గొని, స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జారే ఆదినారాయణను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి మన్నెం విజయలక్ష్మి, అప్పారావు, సోయం నాగబాబు, ఊకే బుల్లిబాబు, పాయం సూర్యం, కుంజా భాస్కర్, కొండా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.