మన్యం న్యూస్ ,గుండాల: పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారంమండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని కొడవటంచ గ్రామానికి చెందిన గొగ్గల రామస్వామి (54) పశువులను మేపుకొని అడవి నుండి ఇంటికి వస్తున్న తరుణంలో సాయంత్రం వచ్చిన భారీ వర్షానికి పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలున్నారు. స్థానిక రెవిన్యూ సిబ్బంది పంచనామా నిర్వహించారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.





