* ఆందోళన వ్యక్తం చేసిన పలు గ్రామాల ప్రజలు
*సోషల్ ఎకానమీక్ సర్వే ను అడ్డుకున్న స్థానికులు
*ఓసి కి వంద మీటర్ల పరిధి కాలనీల్లో సర్వే లేదంటున్న అధికారులు
మన్యం న్యూస్, ఇల్లందు రూరల్: ఇల్లందు మండల పరిధిలోని విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ గ్రామపంచాయితీలో సింగరేణి, రెవిన్యూ వారు సంయుక్తంగా చేస్తున్న సోషల్ ఎకనామిక్ సర్వే రెండు పంచాయతీలలోని కొంత మట్టుకు మాత్రమే పరిమితం చేసి మిగతా ఏరియాను వదిలి వేయాటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విడదీయరాని విధంగా ఉన్న ఏరియాలో కొంత మటుకు ఓసి నీ తీయటం వలన పక్కన ఏరియా లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారంటు ఏరియా వాసులు జీఎం ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఓసి తీస్తే మొత్తం తీయండి లేదా ఓసి ప్రయత్నాలు విరమించుకొండి అంటూ సింగరేణి అధికారులకు స్థానిక ప్రజలు సూచించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓసి బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉంది కావున ఈ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ ఏఫిక్టెడ్ ఫ్యామిలీ (పిఎఎఫ్)గా కాకుండా ప్రాజెక్ట్ డిజాస్టర్ ఫ్యామిలీస్ (పిడిఎఫ్)గా గుర్తించి సింగరేణి సంస్థ నుంచి వచ్చే అన్ని సదుపాయాలను ఇవ్వాల్సిందిగా కోరారు. ఓసీ వల్ల స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను కాదంటే జరగబోయే పనులను అడ్డుకుంటామని సింగరేణి యాజమాన్యానికి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో చాందావత్ రమేష్ బాబు, విజయ్, వంశీ, రమేష్, శ్రీను, రాందాస్, సురేష్ నాని,రాము, సందయ,బొంత సాంబయ్య, అంబాల నర్సయ్య, వంకుడోత్ రమేష్, లక్ష్మిణ్, తదితరులు పాల్గొన్నారు