బాబుజగజీవన్ రామ్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో మహ అన్నదానం
అధిక సంఖ్యలో హాజరైన భక్తజనం
మన్యం న్యూస్ ,అశ్వాపురం: మండల కేంద్రంలో గల బాబు జగజీవన్ రామ్ కాలనీ నందు శ్రీ శిరిడి సాయి నాధుని ఆలయంలో కాలనీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 15 వ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయకుడుకి బుధవారంప్రత్యేక పూజలు జరిపించి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ముత్తినేని సుజాత,దానధర్మ ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా,పంచాయతీ సెక్రెటరీ కృష్ణ చైతన్య, హెచ్ డబ్ల్యూ పిఎం సెక్యూరిటీ ఆఫీసర్ రమణబాబు, బీఆర్ఎస్ మండల యువజన అద్యక్షులు గద్దల రామకృష్ణ, సెక్యూరిటీ సూపర్వైజర్ యాకూబ్* పాల్గొని గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గణనాథుడిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.సకల విఘ్నాలు తొలగించే అవిఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి కోరుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు.15 సంవత్సరాలుగా జరుపుతున్న ఈ గణపతి ఉత్సవాలను కాలనీ యూత్ కమిటీ సభ్యులు ఇంకా కాలనీ వాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.