నక్సలైట్లు మా ఊరికి రావద్దు…..మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి.
*మీ ఉద్యమాలు పోరాటాలు వలన మా బ్రతుకుల్లో మార్పులు ఏమి లేవు
*వారోత్సవాలు, మీటింగ్లకు మేము రాం మీరు రావద్దు…. అంటున్న ఆదివాసులు
*400మంది ఆదివాసీల ర్యాలీ
మన్యం న్యూస్ చర్ల:
మావోయిస్టులు మా గ్రామాల్లోకి రావద్దు మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వండి అంటూ ఆదివాసులు పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. వివరాల్లోకెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలోనిఎర్రంపాడు,చెన్నాపురం,బట్టిగూడెం,విరాపురం గ్రామాలకు చెందిన సుమారుగా 400 మంది ఆదివాసీలు భారీ ఎత్తున ప్లాష్ కార్డ్స్, ఫ్లెక్సీలు తో చర్ల బస్టాండ్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి మండల తాసిల్దార్ తాసిల్దార్ కు చేరుకొని వినతి పత్రం అందించారు. దీనిలో ముఖ్యంగా నక్సలైట్లలరా మా ఊరికి రావద్దు మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి, మీ మీటింగులకు మమ్మల్ని పిలువ వద్దు, గ్రామ కమిటీలు, మిలిషియా వద్దు, జనతా సర్కారు వద్దు, తెలంగాణ సర్కారు ముద్దు, ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఇంకా ఎన్నాళ్లు మాకు అభివృద్ధికి నోచుకోని ఈ బ్రతుకులు పోడు భూములకు పట్టాలు లేవు, పిల్లల చదువుల కోసం కుల సర్టిఫికెట్లు లేవు. రోడ్ల నిర్మాణాలు, విద్యా, వైద్యం సదుపాయాలు లేక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి నేటికీ మా గ్రామాల్లో ఉంది. ఉద్యమాల వలన పోరాటల వలన గత 60 సంవత్సరాల నుంచి మా బతుకు ఏమి మారలేదు కాబట్టి మా బతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి అంటున్నారు. అదేవిధంగా వెంటనే పోడు భూములకు పట్టాలు, కుల ఆదాయ సర్టిఫికెట్లు, మా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ పెద్ద ఎత్తున బస్టాండ్ సెంటర్ నుండి స్థానిక తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ గా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం తహశీల్దార్ రంగు రమేష్ ను కలిసి తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు.