సింగరేణిలో మోగిన ఎన్నికల సైరన్
* ఎన్నికల షెడ్యూల్ విడుదల
* అక్టోబర్ 28న ఎన్నికలు.. అదేరోజు రిజల్ట్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: సింగరేణిలో ఎన్నికలు జరపాలనే అంశంపై పలుమార్లు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు సింగరేణిలో ఎన్నికలు నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. బుధవారం హైదరాబాదులోని చీప్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం సందర్భంగా సింగరేణిలో అక్టోబర్ 28వ తేదీన ఎన్నికల జరపాలని చీప్ లేబర్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 7వ తేదీన నామినేషన్, 9వ తేదీన విత్ డ్రాయల్, పదవ తేదీన గుర్తులు కేటాయింపు జరుగుతుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసి) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ తెలిపారు. అయితే ఇది ఇలా ఉండగా ఎన్నికలు జరిపేందుకు సింగరేణి యాజమాన్యం కొంత సమయం కావాలని మళ్లీ కోరినప్పటికీ ఇచ్చిన గడువు ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిందేనని
చీప్ లేబర్ కమిషన్ తేల్చి చెప్పడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఇట్టి సమాచారం మొత్తం సింగరేణి వ్యాప్తంగా వెళ్లినట్లు తెలిపారు. ఎన్నికల జరిగిన రోజే ఫలితాలు వెలువడతాయని వర్కర్స్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు.