మన్యం న్యూస్, అశ్వాపురం:అశ్వాపురం మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ మారుమూల గ్రామం అయినా మామిళ్ళవాయి కి త్రీ పేజ్ విద్యుత్ లైన్ క్లియర్ అయింది.ఆ గ్రామం పూర్తిగా వన్యమృగ సంరక్షణవిభాగం పరిధిలో ఉంది.దాంతో ఆ గ్రామానికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటుకు అటవీ శాఖ నుంచి అనుమతులు కావాలి నేటి వరకు అనుమతులు రాలేదు అనేక ఏళ్లుగా ఆ ప్రతిపాదన కాగితాల వరకే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రత్యేక కృషితో మామిళ్ళవాయి గ్రామస్తుల త్రీ పేజ్ కరెంటు కష్టాలు తీరుతున్నాయని ఎన్నో ఏళ్ల నాటి కళ నెరవేరింది వెంకటాపురం నుంచి మామిళ్ళవాయి వరకు 6 కిలోమీటర్లు త్రీఫేజ్ విద్యుత్తు లైను కు అటవీ శాఖ అనుమతులు మంజూరయ్యాయి.మంగళవారం నాడు విద్యుత్ శాఖ అధికారులు ఆ గ్రామాలను సందర్శించి త్రీఫేజ్ విద్యుత్తు లైన్ ఏర్పాటుకు అంచనాలను రూపొందించేందుకు పరిశీలనలు జరిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ సంస్థ ఏ ఈ ఉమారావు, ఇంజనీరు మనిధర్ ,వెంకటాపురం సర్పంచ్ మడకం సాదు ,బొర్రా శ్రీను గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.