*హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం
*మహబూబాబాద్ ఎంపీ కవిత మాలోత్
కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రి:ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ *మన్యం న్యూస్,ఇల్లందు:హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాలను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత బుధవారం సందర్శించారు. టేకులపల్లిలో నెలకొల్పిన ఉచిత వైద్యశాలను ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులతో కలిసి ఆసుపత్రిని సందర్శించి అభినందించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న చికిత్సావిధానం, పరికరాలు, బెడ్లు తదితర సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్నివార్డులకు కలియతిరుగుతూ అక్కడి సదుపాయాలకు పూర్తి సంతృప్తిని వ్యక్తపరిచారు. కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయికి ధీటుగా వాటికి ఏ మాత్రం తగ్గకుండా అన్నిరకాల సదుపాయాలతో హరిప్రియ ఆసుపత్రిని నిర్మించడం ఎంతోమందికి స్ఫూర్తి దాయకమని ఎంపీ కవిత కొనియాడారు. ఇల్లందు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేయటమే కాకుండా పేదప్రజల ఆరోగ్యరక్షణకై ప్రజల సౌకర్యార్థం ఉచిత వైద్యశాలను ఏర్పాటుచేయటం గొప్ప విషయమని ఎమ్మెల్యే హరిప్రియను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, టేకులపల్లి మండల అధ్యక్షుడు ప్రసాద్, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.