మన్యం న్యూస్,ఇల్లందు:దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి పోరాట ఫలితమే సింగరేణి గని కార్మికులకు నేడు 32శాతం లాభాలవాటా దక్కిందని ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే సారయ్య, బ్రాంచి కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ లు అన్నారు. ఈ సందర్భంగా సంయుక్తంగా ప్రకటన విడుదల చేసిన వారు మాట్లాడుతూ..యూనియన్ అధ్యక్షుడు మహేంద్ర 1999-20 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ఒప్పించి లాభాలలో 10శాతం వాటాను గని కార్మికులకు అందెలా చేశారని తెలిపారు. ఆ సందర్భంగా ఆనాడు చంద్రబాబు సింగరేణి నష్టాలలో ఉంది కాబట్టి ఈ నష్టాలకు కార్మికులే బాధ్యులు కనుక కార్మికుల జీతాలనుండి ఈ నష్టాన్ని రికవరీ చేస్తానని ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి కేల్ మహేంద్ర సమాధానం చెబుతూ కంపెనీ నష్టాలను కార్మికుల జీతాలనుండి రికవరీచేసే చట్టం భారతదేశంలో ఏదీలేదని నీవు కూడా చట్టబద్ధంగానే ముఖ్యమంత్రివి అయ్యావని అది తెలుసుకో అని ఘాటుగా సమాధానం ఇచ్చారని, గని కార్మికులు లాభాలు తెస్తే కార్మికులకు ఏమిస్తారని చంద్రబాబునాయుడుని అడిగగా లాభాలు తెస్తే 10శాతం లాభాలవాటాను కార్మికులకు ఇస్తానని తెలుపారని పేర్కొన్నారు. వెంటనే ఈ విషయాన్ని చట్టబద్ధంగా, అధికారికంగా నిమిషాల్లో నోట్ చేపించి దీనిని అమలుచేయించారని అన్నారు. అప్పటివరకు నష్టాలతో నడుస్తున్న బొగ్గుగని కార్మికులను సమైక్యపరిచి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనైనా మనందరం కష్టపడదాం లాభాలు తీసుకువద్దాం తద్వారా నాలుగు కాలాలకు లాభాలవాటాను దక్కించుకుందామని కార్మికులను చైతన్యపరిచి ఆ సంవత్సరం వచ్చిన లాభాలలో 10శాతం లాభాల వాటాను గని కార్మికులకు అందింపజేశారని పేర్కొన్నారు. కెఎల్ మహేంద్ర కృషితో అప్పటినుంచి నేటివరకు సంస్థకి వస్తున్న లాభాలలో ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి వారు ఒకశాతం, రెండుశాతం, మూడుశాతంగా వాటాను పెంచుతూ నేడు 32శాతానికి లాభాలవాటాను పెంచుకోగలిగామని వారు పేర్కొన్నారు. ఇది పూర్తిగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ పోరాటఫలితమేనని వారు తెలియజేశారు.