UPDATES  

 చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ :

 

మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి సెప్టెంబర్ 27: అశ్వరావుపేట నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నాయకులు కట్రం స్వామి దొర ఆదేశాలు మేరకు అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పానుగంటి రామారావు అధ్వర్యంలో డా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల బుధవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.టీడీపీ నిరసన ర్యాలీకి అశ్వరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధారబోయిన రమేష్ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టిడీపి జిల్లా అధ్యక్షులు వాసురెడ్డి రామనాధం,అశ్వరావుపేట టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాస్,వలీ పాషా,కిసరి విజయ్,రేగులగడ్డ జగదీష్,శ్రీనివాస్ రావు,అంజి,వెంకటేశ్వర్లు,తాటి మోహన్ రావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు దారా బోయిన రమేష్,చల్ల పుల్లయ్య,తాటి యార్రంనాయుడు,పద్దం వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !