మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
కొత్తగూడెం బాబు క్యాంప్ బృందావన్ గార్డెన్ లో బుధవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా కేవీ రంగా కిరణ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణనాధుని నవరాత్రులు పూర్తి చేసుకున్న సందర్భంగా సహపంక్తి భోజనాలు విశేషకరమైనవి భవిష్యత్తులో కొత్తగూడెం పట్టణంలో ఆదర్శప్రాయంగా ఇంకా మంచి కార్యక్రమాలు ఇక్కడ జరగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జల్లారపు శ్రీనివాసరావు, మహేష్, ఆలయ కమిటీ భక్తులు తదితరులు పాల్గొన్నారు.