మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావును మణుగూరు మండలం ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను విప్ రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు సమస్యలను క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి,వెంటనే పరిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ను శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వర్లు,ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.