UPDATES  

 మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్,ప్రాజెక్ట్ జి.వేంకటేశ్వర రెడ్డి

 

మన్యం న్యూస్ మణుగూరు:

సింగరేణి కాలరీస్ డైరెక్టర్ ప్లానింగ్,ప్రాజెక్ట్ జి వేంకటేశ్వర రెడ్డి మణుగూరు ఏరియాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మణుగూరు ఏరియా ఏరియా జీఎం దుర్గం రామ చందర్ తో కలసి కొండాపురం గని యందు కంటిన్యూయస్ మైనర్ యంత్రం ద్వారా జరుగు బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ యాజమాన్యం వారి తో చర్చించడం జరిగింది. అనంతరం పికేఓసి-2 వ్యూ పాయింట్ నుండి క్వారి లో జరిగే బొగ్గు ఉత్పత్తిని,యంత్రల ద్వారా బొగ్గు లోడింగ్ ప్రక్రియ ను పరిశీలించడం జరిగింది. అనంతరం డైరెక్టర్ ప్లానింగ్, ప్రాజెక్ట్ జి.వేంకటేశ్వర రెడ్డి మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తిని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏరియాలో సత్వరంగ నిర్దిష్టమైన ప్రణాళికలు వెంటనే రూపొందించుకోవాలి అని అధికారులకు సూచించారు. మణుగూరు ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకత,లక్ష్యాల సాధనపై, బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో పూర్తి స్థాయిలో రక్షణ పాటిస్తూ, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేస్తూ,ఏరియాకు నిర్దేశించిన బొగ్గు,ఓబి లక్ష్యాలను సాధించుటకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సంవత్సర 2023-24 వార్షిక ఏరియా లక్ష్యమైన 119.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సమిష్టి కృషితో సాధించాలి అన్నారు.అందుకు గాను మ్యాన్ పవర్ ను,యాంత్రిక శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని పని గంటలను 13.5 గంటల నుండి 18.00 గంటలకు పెంచడం ద్వారా లక్ష్యాలను సులువుగా సాదించాలి అని పేర్కొన్నారు. ఉత్పత్తి ఐయిన రోజు వారి బొగ్గును సకాలం లో డిస్పాచ్ అయ్యేల ఆయా గనుల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని,అలాగే ఓబి నిర్దేశిత లక్ష్యాలను కూడ సాదించాలని డైరెక్టర్ ప్లానింగ్, ప్రాజెక్ట్ జి.వేంకటేశ్వర రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్,ప్రాజెక్ట్ అధికారి పీకేఓసి లక్ష్మీపతి గౌడ్, కేపియూజి పిఓ వీరభద్ర రావు, ప్రాజెక్ట్ ఇంజినీర్ పికేఓసి వీర భద్రుడు,కేపియూజి మేనేజర్ బి వెంకటేశ్వర్లు,కేపియూజి సేఫ్టీ అధికారి మధు బాబు,సర్వే అధికారి చిట్ట శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి షబ్బీర్బేద్దీన్,ఎస్ఎంఎస్ అధికారి సివి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !