మన్యం న్యూస్,పినపాక:
పినపాక మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన బురుగడ్డ రాములు (50) ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.గురువారం పినపాక ఎమ్మెల్యే రేగ కాంతరావు గోపాలరావు గ్రామంలో మృతుని నివాసానికి వెళ్లి రాములు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించివారికి ధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ గుమ్మడి గాంధీ, బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, కటకం గణేష్,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.