నూతన పోలీసు స్టేషన్ ని సందర్శించిన ప్రభుత్వ విప్ రేగా.
తెలంగాణ పోలిస్ దేశానికే ఆదర్శం
ఫ్రెండ్లీ పోలీసులతో ప్రజలకు మరింత చురుకైన సేవలు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ కరకగూడెం:కరకగూడెంలో 2 కోట్ల రూపాయల అంచన వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషను ను గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు,మణుగూరు సబ్ డివిజన్ డిఎస్పి ఎస్ వి రాఘవేంద్రరావుతో కలిసి సందర్శించారు.తొలుత మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు,ఎడుళ్ళ బయ్యారం సిఐ.శివప్రసాద్,కరకగూడెం ఎస్ఐ రాజారామ్ ప్రభుత్వ విప్ రేగా కు ఘన స్వాగతం పలికి పూలమొక్కను అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలిస్ లు దేశానికే ఆదర్శం అని ఫ్రెండ్లీ పోలిస్ లతో ప్రజలకు మరింత చేరువైన సేవలు, శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోని మన పోలీసు లకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన అన్నారు.ఫ్రెండ్లీ పోలీసు లతో ప్రజలతో పోలీసులకు స్నేహపూరిత వాతావరణ నెలకొందని దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి వ్యవస్థ లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ విజయవంతంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర సుభిక్షంగా ఉండేందుకు సిఎం కేసీఆర్ పోలీస్ శాఖకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.