కార్మిక రత్న జాతీయ అవార్డుకు కూసన వీరభద్రం
* అభినందనలు తెలిపిన టీబీజీకేయస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
బహుజన సాహిత్య అకాడమీ కార్మిక రత్న జాతీయ అవార్డుకు బిఆర్ఎస్ అనుబంధ కార్మిక తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రీజినల్ సెక్రటరీ ఎంపీటీసీ కూసాన వీరభద్రంను ఎంపిక చేయడం పట్ల టిబిజికేయస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ అభినందనలు తెలిపారు. రామవరం టీబీజీకేఎస్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అవార్డు అక్టోబర్ నెల 15వ తేదీన న్యూ ఢిల్లీలో నాల్గవ బహుజన సాహిత్య అకాడమీ వార్షికోత్సవ సభలో ప్రధానం చేయనున్నారని తెలిపారు. 27 రాష్ట్రల నుండి ఎంపిక చేసినటు వంటి వారికి ఈ అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా తెలంగాణ నుండి ప్రత్యేకించి బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కూసాన వీరభద్రంకు దక్కడం ఎంతో గర్వకారణం అని కొనియాడారు. ఈ సమావేశంలో గోపు కుమార్ స్వామి, నిమ్మల రాజేశ్వరరావు, చిలక రాజయ్య, చెరిపల్లి నాగరాజు, ఎస్కే గౌస్, ఎం.డి సత్తార్ పాష, శనగరపు కుమార్, అజ్మీర నరేష్, ఎండి గౌస్, మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.