మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఖమ్మం కార్పొరేషన్ ప్రతి వీధికి రోడ్డు ఉండాల్సిందేనని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం కార్పొరేషన్ 12వ డివిజన్ నందు ఎల్ఆర్ఎస్ నిధుల కింద రూ.20లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్లో చిన్న చిన్న రోడ్లు సైతం వెతికి వెతికి సీసీ రోడ్లు వేశామని అన్నారు. నగర సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, డ్రైన్లు వేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ ఇచ్చిన రూ.50 కోట్లతో ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో సీసీ డ్రెయిన్లు నిర్మించేందుకు ఇప్పటికే శంకుస్థాపనలు చేశామని పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, జిల్లా ఆర్టిఏ
సభ్యులు వల్లభనేని రామారావు తదితరులు పాల్గొన్నారు.