మాట్లాడుతుంటే నా మైక్ లాకున్నావ్..మూడు నెలల్లోనే నీ సీటు లాక్కుంటా
విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు కామెంట్స్
మన్యం న్యూస్,భద్రాచలం:
నా మైక్ లాక్కున్నావ్,మూడు నెలల్లో నీ సీటు లాక్కుంటా అని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు.ఇటీవలే విప్ రేగా కాంతరావు,డీ.సీ.సీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య లు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంలో భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య సహనం కోల్పోయి విప్ రేగా కాంతారావు చేతిలో మైకు ని లాగే ప్రయత్నం చేశారు.ఆ సమయంలో ఇద్దరు మధ్యన వాగ్వాదం చోటుచేసుకుంది. ఆనాటి ఘర్షణను గుర్తు చేస్తూ, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్యకు సోషల్ మీడియా వేదికగా రేగా కాంతారావు చురుకలు అంటించారు.మంత్రి పర్యటన నేపథ్యంలో విప్ రేగా కాంతారావు కామెంట్స్ తో భద్రాచలం నియోజకవర్గం లో రాజకీయం ఆసక్తికరంగా మారింది.