- రేగా తోనే మా ప్రయాణం
- బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం
- బిఆర్ఎస్ ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు ఓసి-2 లో విధులు నిర్వహిస్తున్న ఏ రిలే డ్రైవర్స్, కార్మికులతో బిఆర్ఎస్ ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తురక రామకోటి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షులు తురక. రామకోటి మాట్లాడుతూ,ఓబి యూనియన్ కు ఎల్లప్పుడూ అండగా ఉంటూ,కార్మికుల పక్షపాతిగా,కార్మికుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావును రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని వారు కార్మికులను కోరారు.ఈ సందర్భంగా కార్మికులంతా ఒకటే మాటపై ఉంటూ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నాయకత్వాన్ని బలపరుస్తూ, బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని,బిఆర్ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రేజరర్ గడిదేశీ మధుబాబు, సెక్రటరీ కనతాల మహేష్, ప్రచార కార్యదర్శి జల్లారపు సతీష్,ఆర్గనైజేషన్ సెక్రటరీ రవి,ఫిట్ కమిటీ సభ్యులు విజయ్,అరుణ్,గోపాల్,జాన్సన్ ,సీనియర్ ఆపరేటర్ రత్నాకర్ కార్మికులు పాల్గొన్నారు.





