UPDATES  

 పాఠ్యా పుస్తకాల్లో కుల నిర్మూలన అంశాన్ని చేర్చాలి

 

మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- సత్యశోధ సమాజ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఇల్లందు మండల కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడిఎస్యు) ఆధ్వర్యంలో కుల నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడిఎస్యు నాయకులు గణేష్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సామాజిక పోరాటాలు నిర్వహించాడని జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే ల జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. సమాజంలో ఉన్న కుల సమస్యను తీవ్రంగా వ్యతిరేకించారని అందులో భాగంగానే సత్యశోధక్ సమాజ్ స్థాపించి వారి ఇంటిలోనే పేదలకు ముఖ్యంగా మహిళలకు విద్యను అందించారని, నాటి పరిస్థితుల్లో మహిళను గడప దాటనివ్వని కట్టుబాట్ల మధ్యలో జ్యోతిబాపూలే భార్య అయిన సావిత్రిబాయి పూలే తోనే చదువు చెప్పించాడని, అనేక అవమానాల ఎదురైన వెనకడుగు వేయకుండా ముందుకు సాగారని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు కుల సమస్య సమాజంలో వట వృక్షం లా పేరుకుపోయిందని అన్నారు. మనిషిని మనిషిగా చూడని, సాటి మనిషిని అంటరానివానిగా చూసే కుల వ్యవస్థను పోవాలని అన్నారు. కులం సామాజిక వెనకబాటు కారణం అవుతున్నందున , కులనిర్మూలన అంశం పాఠ్య పుస్తకల్లో చేర్చాలని అనారు.
ఈ కార్యక్రమంలో నవీన్, పల్లవి, ఆకాష్, సంధ్య, సిద్దు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !