మన్యం న్యూస్,బూర్గంపహాడ్:
బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డా. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాప్ నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమానికి బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ముఖ్యఅతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అందుబాటులో ఉన్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. మండల ప్రజలందరూ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు.ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ కార్డు రిజిస్ట్రేషన్ కూడా ఆస్పత్రి ఆవరణలో చేయడం జరుగుతుంది కావున మండల ప్రజలు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు కోసం తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి జెడ్పీటీసీ కోరారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల యూత్ అధ్యక్షులు గోనెల నాని, బీ. ఆర్.ఎస్ పార్టీ నాయకులు మందా ప్రసాద్, ,బర్ల ప్రవీణ్ కుమార్,కునమల్ల వెంకటరమణ, డేగల నవీన్,ముత్యం, వంశీ,రిపోర్టర్ కోట రమేష్,బూర్గంపహాడ్ ఆసుపత్రి ప్రధాన వైద్యులు Dr, నవీన్ కుమార్, ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.