మృతి చెందిన గౌడన్న కుటుంబానికి ఆర్థిక సాయం
*50 కేజీ ల బియ్యం, రూ 2వేల ఆర్థిక సాయం అందజేసిన తాళ్లపల్లిరాహుల్ గౌడ్
మన్యం న్యూస్,పినపాక:
మండల పరిధిలోని పినపాక గ్రామానికి చెందిన చామకూరి భగవంతు గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గ గౌడ సంఘం యువజన విభాగం నాయకులు, బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు తాళ్లపల్లి రాహుల్ గౌడ్ శుక్రవారం పినపాక లో భగవంతు కుటుంబానికి 50 కేజి ల బియ్యం,2వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీ. ఆర్.ఎస్వీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.ఎన్. రాజు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు పవన్ నాయక్ ,బీ. ఆర్ .ఎస్ పార్టీ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు సోంపేల్లి తిరుపతి,పినపాక నియోజకవర్గ యువజన విభాగం కార్యదర్శి బండ మనోజ్ కుమార్ రెడ్డి,కొంపెల్లి మల్లేష్ గౌడ్,చిర్ర ఉప్పలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





