మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన మల్లం బాబురావు అనే వ్యక్తి మద్యం మత్తులో జియో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాల్లోకెళ్తే కలివేరు గ్రామానికి చెందిన బాబురావు తన భార్య నాగమణితో పలుమార్లు గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే నాలుగు సంవత్సరాల క్రితం గొడవలు పడి పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడం లేదంటూ తీవ్ర మనస్థాపన చెంది మద్యం మత్తులో గ్రామంలోని ఉన్న జియో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునుటకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన స్థానికులు బాబురావుకు నచ్చచెప్పి సెల్ టవర్ నుంచి క్రిందకు దింపారు. దీనితో గ్రామస్తులు చుట్టుపక్కన ఉన్న వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నారు.





