మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని రేగుళ్ళ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కన్వినర్ టి పిసిసి సభ్యులు డాక్టర్ చందా.సంతోష్ కుమార్ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కర పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకోసం సోనియా గాంధీ 6 గ్యారెంటీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి అవకాశం ఇస్తే ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.