మన్యం న్యూస్,ఇల్లందు:గార్ల మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్రలు శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి విస్తృత పర్యటన చేశారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, మండల నాయకులతో కలిసి గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటరులో ఆపరేషన్ థియేటర్, ఎక్సరే యూనిట్లను కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రైల్వేస్టేషన్ సమీపాన ఐదులక్షలతో వేసిన సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. రైల్వేస్టేషన్, పరిసరాలను ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే హరిప్రియలు పరిశీలించి సౌకర్యాల లేమిని గుర్తించారు. ఎంపీ వద్దిరాజు రైల్వే అధికారులకు ఫోన్ చేసి గార్లస్టేషన్లో ప్రయాణీలకు మరిన్ని సదుపాయాల కల్పనకు వెంటనే తగుచర్యలు తీసుకోవాల్సిందిగా పలుసూచనలు చేయటం జరిగింది. స్థానిక ప్రయాణీకుల సౌకర్యార్థం పలు ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇచ్చే అవకాశాలను పరిశీలించవలసిందిగా ఎంపీ రవిచంద్ర అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.