కాంగ్రెస్ ను వీడి కారెక్కిన ఎంపీపీ గీద కోదండ రామయ్య
హైదరాబాద్ ప్రగతి భవనంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక
బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం.
*ఎంపీపీ కోదండరామయ్య
మన్యం న్యూస్, చర్ల:
హైదరాబాద్ ప్రగతి భవనంలో తెలంగాణ రాష్ట్ర విప్ రేగ కాంతారావు, డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో చర్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ గీద కోదండ రామయ్య మండల నాయకులు గూడపాటి సతీష్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కోదండరామయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన అన్నారు. భద్రాచలం నియోజకవర్గం లోని మండల అభివృద్ధి కార్యక్రమాలు బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు వంటి పథకాలు ప్రజలలో ఆదరణ పొందాయని కెసిఆర్ రాష్ట్ర పాలనలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన అన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం ప్రతినిత్యం పాటుపడతానని నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయుటకు తగిన కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు మాలవత్ కవిత, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.





