మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ములుగు జిల్లా చైర్ పర్సన్ బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే.నాగజ్యోతిని కరకగూడెం బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని మీ గెలుపు కోసం మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.ములుగులో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు ముక్తకంఠంతో చూస్తున్నారని ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం.రాంబాబు,సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ,మండల ఉపాధ్యక్షులు పోగు.వెంకటేశ్వర్లు,యువజన నాయకులు కట్టుక్వోజల.వేణు,నిట్టా.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.