మన్యం న్యూస్, అశ్వాపురం:ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల పరిధికలవ బజారు గ్రామానికి చెందిన మండల బిఆర్ఎస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి రావుల రాధమ్మ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని ఆమెను మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రంలు శుక్రవారం పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమం లో అశ్వాపురం గ్రామ శాఖ అధ్యక్షులు జూపెల్లి కిరణ్,జెన్నీ రాజశేఖర్,కరకాపల్లి డేవిడ్,తదితర నాయకులు పాల్గొన్నారు.





