ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులు నియమించే వరకు దీక్ష విరమించేది లేదు
* సిపిఎం మండల కమిటీ.
మన్యం న్యూస్, చర్ల:
చర్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. కెవిపిఎస్ చర్ల మండల సెక్రెటరీ మచ్చ రామారావు మాట్లాడుతూ చర్ల ప్రభుత్వ హాస్పిటల్ లో వెంటనే ఎంబిబిఎస్ డాక్టర్ని నియమించాలని వైద్యానికి సరైన మందులు ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఇకనైనా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలోగల సుమారుగా 70 గ్రామాల ప్రజలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా విష జ్వరాలు విజృంభించి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో సరైన డాక్టర్ లేక మందులు లేక ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యానికి డబ్బులు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వెలుబుచ్చారు. తక్షణమే డాక్టర్ ని నియమించాలని మచ్చ రామారావు డిమాండ్ చేశారు. ఈ సభలో సిఐటియు గణేష్, ఆటో యూనియన్ అధ్యక్షులు పామూరు బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.