మన్యం న్యూస్ ,అశ్వాపురం: మణుగూరు నూతన సీఐ గా బాధ్యతలు చేపట్టిన ఎమ్ రమాకాంత్ ని శుక్రవారం దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, శివ కామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు దోస పాటి పిచ్చేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే ఇచ్చి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గురు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.





