మన్యం న్యూస్, పినపాక:
కస్తూర్బా పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ స్రవంతి పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధికి శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కస్తూర్బా సమస్యలు విన్న ఎంపీపీ గుమ్మడి గాంధీ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు పధ్మ,వ్యాయమ ఉపాధ్యాయులు విజయ లక్ష్మి, పాల్గొన్నారు.





