మన్యం న్యూస్ బూర్గంపహడ్: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రీడాకారులకు కిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత హాజరై క్రీడా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతుంది అని,అన్ని రకాల క్రీడలను అనుకూలంగా పనిచేసే క్రీడాలకు క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తుందనీ,క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెతికి తీసేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు,ఈ క్రమంలో బూర్గంపహడ్ మండలంలో 17 పంచాయితీలకు క్రీడా సామాగ్రిని అందించడం జరిగిందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు,
ఉప సర్పంచులు,మండల నాయకులు,యూత్ నాయకులు,మండల అధికారులు,సెక్రటరీలు, క్రీడాకారులు,క్రీడాభిమానులు,యువకులు,బి.ఆర్.యస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.





