మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని గొల్లగూడెంలో 5 లక్షల45 వేలు,బట్టుపల్లి గ్రామాలలో 5 లక్షల 76 వేల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లను ఎంపిపి రేగా కాళికా ఎఈ నరేందర్ రెడ్డి స్విచ్ అను చేసి ప్రారంబించారు. ప్రతి మారుమూల గ్రామానికి ప్రతి ఇంటికి విద్యుత్ కాంతిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూస్తున్న సర్పంచులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లగూడెం సర్పంచ్ ఇర్ప. విజయ్ కుమార్, రఘునాదపాలెం సర్పంచ్ పోలెబోయిన. నరసింహరావు, ఉపసర్పంచ్ చెను.సాంబయ్య,ఎగ్గడి. భాస్కర్,రేగా.సత్యనారాయణ, వాసిరెడ్డి నేతాజీ, నిట్టా.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.





