*పల్లెల అభివృద్ధి రేగాతోనే సాధ్యం
జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ 13 సీసీ రోడ్డు పనులకుశంకుస్థాపన చేసిన జడ్పిటిసి
మన్యం న్యూస్, అశ్వాపురం: అశ్వాపురం మండలంలో బట్టిలా గుంపు,మిట్టగూడెం,కళ్యాణపురం గ్రామపంచాయతీలలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు సుమారు 65 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 13 సీసీ రోడ్లకు జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి రేగాతోనే సాధ్యమని,మండలంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,ఈదర సత్యనారాయణ,మామిళ్ళ నాగభూషణం,చిలక వెంకటరామయ్య, ఏనుగుల సత్యనారాయణ,ఐతం సత్యనారాయణ,బట్టిలాగుంపు సర్పంచ్ పాయం సత్యనారాయణ,మిట్టగూడెం సర్పంచ్ పరిష్క రాదమ్మ,కళ్యాణపురం ఉపసర్పంచ్ మేకల లక్ష్మణ్,మిట్టగూడం ఉపసర్పంచ్ రాజేశ్వర్,పినపాక నియోజకవర్గం యువజన విభాగం అధికార ప్రతినిధి మామిళ్ల రాము,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మామిళ్ల కనీష్,వార్డు మెంబర్లు చల్లా రాజేష్,బానోత్ నాగేష్,తదితర గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





