రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమ్మె కాలపు వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం. .విధుల్లో చేరనున్న అంగన్వాడీలు.
మన్యం న్యూస్
నూగురు వెంకటాపురం . అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం 24 రోజుల నుండి నిర్వహిస్తున్న సమ్మె ముగిసింది. సమ్మె కాలాన్ని కి వేతనాన్ని చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించినట్టుగా అంగన్వాడీలు తెలిపారు.
ఐదు శాతం ఐ ఆర్, పిఆర్సి అమలు చేయడానికి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రెండు లక్షల రూపాయలు, వేతనాలు చెల్లించడానికి ఎటువంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా మార్చడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు . దహన సంస్కారాల ఖర్చులు టీచర్లకు 20,000 ,మినీ టీచర్స్ ఫర్ హెల్పర్స్ కు రూ.10000, మే నెల మొత్తం నెల సెలవులు ఇచ్చే విధంగా ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపిందని సిఐటియు జిల్లా కోశాధికారి వెంకటరమణ తెలిపారు, అంతేకాకుండా అంగన్వాడీలకు కొంచెం ఊరట కలిగించేలా ఆన్లైన్ యాప్ లన్నింటినీ రద్దుచేసి ఒకే యాప్ ఉండే విధంగా కేంద్ర గవర్నమెంట్ కు చెప్పడం జరిగిందని, ఇంకా ఇతర సమస్యలు పరిష్కారం కోసం మంత్రితో మాట్లాడి ముఖాముఖి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టుగా వెంకటరమణ తెలిపారు.





