కన్న పాపను అడవిలోవదిలేసిన కసాయి తల్లి
ఏడ్పులు విని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు
మన్యం న్యూస్ ,నూగూర్ వెంకటాపురం:
నుగూర్ వెంకటాపురం మండలం పాత్ర పురం గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పాపను అడవి పొదలలో వదిలి వెళ్లిపోయారు,
అటుగా వెళుతున్న గ్రామస్తులు పాప ఏడుపులను గమనించి హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిడ్డపై చిన్న చిన్న చెట్లు గీసుకుపోయిన ఆనవాళ్లు కనబడుతున్నాయి. మండలప్రజలు ఈ విషయం పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు.





