రూ.కోటి సీసీ రహదారులు ప్రారంభం
*గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ఎమ్మెల్యే రేగా ది
మండలంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసిన జడ్పిటిసి.
*టేకుల చెరువు, కృష్ణ సాగర్,ముసలి మడుగు,టేకుల చెరువు, నకిరపేటల లో సీ సీ రోడ్లు ప్రారంభం
సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయడం లేదు.
జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బీ. ఆర్.ఎస్ మండల అధ్యక్షులు గోగి రెడ్డి
*మన్యం న్యూస్ బూర్గంపహడ్:-మండలం లో గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ఎమ్మెల్యే రేగా కాంతారావు కు దక్కుతుంది అని జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బీ. ఆర్.ఎస్ మండల అధ్యక్షులు గోగిరెడ్డి రమణా రెడ్డి అన్నారు.మండల పరిధిలోని రూ. కోటి తో నిర్మించిన సీసీ రోడ్లను ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశం మేరకు ప్రారంభోత్సవం చేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత బుధవారం ప్రారంభించారు. ముసలమడుగు గ్రామపంచాయతీలలో రూ.20 లక్షలు, కృష్ణసాగర్ గ్రామపంచాయతీలో రూ. 20 లక్షల తో ఎస్డిఎఫ్ నిధులతో నిర్మించిన 4 సిసి రోడ్లు, లక్ష్మీపురం గ్రామపంచాయతీలో రూ.20 లక్షల తో నిర్మించిన 4 సిసి రోడ్లను, నకిరిపేట గ్రామపంచాయతీలో సుమారు 10 లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో నిర్మించిన 2 సిసి రోడ్లను, టేకులచెరువు గ్రామపంచాయతీలో సుమారు 20 లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో నిర్మించిన 4 సీ సీ రోడ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, మండలంలోని గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తున్న రేగా కాంతారావుకి రుణపడి ఉండాలనీ అన్నారు.ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నదని,సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయడం లేదని,ప్రతి గ్రామంలో సీ సీ రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత,సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్ రావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి,స్థానిక సర్పంచ్ లతో పాటు మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,యూత్ ప్రసిడెంట్ గొనేల నాని,ఇరవెండి మాజీ ఎంపీటీసీ సభ్యులు వల్లురుపల్లి వంశీ అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు పొడియం నరేందర్,మండల నాయకులు,మండల అధికారులు,గ్రామ పెద్దలు మహిళలు,తదితరులు పాల్గొన్నారు.





