UPDATES  

 బాలికలు చదువుల్లో రాణించాలి: ఎమ్మెల్యే వనమా

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని
కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బాలికా విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని దీనిని సద్వినియోగం చేసుకొని బాలికలు
ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బాలికలకు సరి
అయిన రవాణా సదుపాయాలు లేక పాఠశాలకు తరచూ గైర్హాజరు అవడం తద్వారా చదువులో వెనుకబడి చివరికి బడి
మానివేయడం జరుగుతుందన్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం బాలికలకు సైకిళ్ళు అందిస్తే వారు చదువుకు దూరమవ్వకుండా
ఉంటారని భావించి బాలికలకు సైకిళ్ళు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని వెనుకబడిన
మండలాలు అయిన గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, అశ్వారావుపేట మండలాలలోని ప్రభుత్వ
పాఠశాలలలో 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం నుండి పాఠశాలకు వస్తున్న విద్యార్థినులను 200 మందిని గుర్తించి వారికి
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యములో 15 లక్షల రూపాయల విలువైన సైకిళ్లను అందించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
ఈ సైకిళ్లను ఉపయోగించుకొని బాలికలు చదువుకు దూరం కాకుండా పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై మంచి నాణ్యమైన
విద్యను గడించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిల్లలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరా చారి, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి
ఏ.నాగరాజ శేఖర్, జిల్లా కమ్యూనిటీ మొబిలిజేషన్ అధికారి ఎస్. కె. సైదులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్ధినులు పాల్గొన్నారు.
సొంతింటి కల కెసిఆర్ తోనే సాధ్యం..
సొంతింటి కల సీఎం కెసిఆర్ తోనే సాధ్యమవుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్ లో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదల సంక్షేమ కోసం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే అనేక రకాల పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, వార్డు కౌన్సిలర్లు, మండల పరిషత్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !